విజయనగరం : ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా వివాదాస్పదంగా ఉన్న కొఠియా గ్రూపు గ్రామాల్లో ఎట్టి పరిస్థి తుల్లోనూ ఆంధ్ర ప్రదేశ్ నిర్వహించే ప్రాదేశిక ఎన్నికలు జరగనివ్వబోమంటూ ఒడిశా అధికారులు పోలింగ్ ను అడ్డుకున్నారు.. వారికి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు మద్దతు తెలుపుతూ అధికారులతో కలిసి ఆందోళన చేపట్టారు. అక్కడితో ఆగకుండా కొఠియా గ్రూపు గ్రామాల్లో ముఖ్య గ్రామాలైన గంజాయి భద్ర, పట్టు-చెన్నూరు, పగులుచెన్నూరు, కొఠియా గ్రామాల ప్రజలు గ్రామం పోలింగ్ కు రానివ్వకుండా గ్రామాల చుట్టూ రాళ్లు పేర్చి అష్ట దిగ్భంధం చేసారు. అదేవిధంగా మైదాన ప్రాంతంలో ఉన్న నేరెళ్లవలస గ్రామంలో ఒడిశాకి చెందిన 60-70 మంది పోలీసులను మొహరింపజేసారు. ఎపిలో పోలీసులను గ్రామాలలోకి రాకుండా అడ్డుపడ్డారు.. ఒకనొక దశలో ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకూ వెళ్లారు.. ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు సకాలంలో జోక్యం చేసుకోవడంతో దాడులు నిలిచిపోయాయి.. కాగా, తమ రాష్ట్రంలో ఉన్న కొఠియా గ్రామాలలో
వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అధికారులు ధర్నా నిర్వహించారు. కొఠియా గ్రూపు గ్రామాలు ఒడిశా రాష్ట్రానికి చెందినవని, ఆయా గ్రామాలకు చెందిన వివాదం కోర్టులో ఉన్నందున ఆయా గ్రామాల్లో ఎన్నికలు జరపరాదని నినాదాలు చేసారు. ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న ప్రాదేశిక ఎన్నికల్లో కొఠియా గ్రూపు గ్రామాల ప్రజలు పాల్గొనకుండా ఒడిశారాష్ట్రానికి చెందిన వివిధ పార్టీల నాయకులు గత కొన్ని నెలలుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నేడు పోలింగ్ సందర్భంగా మరో అడుగు ముందుకు వేసి ఒడిశా రాష్ట్రం కుందిలి, పొట్టంగి, చిమిలి గుడ, కొరా పుట్ పట్టణాలకు చెందిన బిజెడి, భాజపా, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్‌తోపాటు- మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపి, వివిధ బ్లాకుల మాజీ చైర్మన్లు, తారా ప్రతాప్ బెహన్ మాజీ, జయరాం పంగి, ప్రీతం పాడి, తదితర నేతలు, కార్యకర్తలు తరలివెళ్లి కొఠియా గ్రామంలో తిష్ట వేసా రు. ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్న ప్రాదేశిక ఎన్నికల్లో ఓటు- వేసేందుకు వెళ్లకుండా అడ్డుకుంటామని ప్రతిజ్ఞ చేసారు. ఇదిలావుండగా మండలంలో 16 ఎంపిటిసి సిగ్మెంట్లు-ండగా వాటితో పాటు- ఒక జడ్పీటీసీ స్థానానికి నేటి ఉదయం పోలింగ్ ప్రారంభమైంది..ఈ ఎన్నికల్లో కొఠియా గ్రూపు గ్రామాల పరిధిలో ఉన్న గంజాయి భద్ర, పగులుచెన్నూరు, పట్టు- చెన్నూరు తదితర పంచాయతీలుండగా వాటి పరిధిలో ఉన్న 21 గ్రామా లు వివాదాస్పదంగా ఉన్నాయి. అయితే నేడు జరగను న్న ఎన్నికల్లో వీరు తమ ఓటు- హక్కును వినియోగించు కోవల్సిఉంది. ఒడిశా అధికారులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎట్టిపరిస్థితు ల్లోనూ కొఠియా గ్రామాల ప్రజలు ఎన్నికల్లో పాల్గొన కుండా చర్యలు చేపట్టారు. దీంతో విజయనగరం ఎస్పీ రాజకుమారి నేరుగా రంగంలోకి దిగారు…సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు దృష్ట్యా పోలింగ్ నిర్వహణకు సహకరించాలని ఒడిశా అధికారులను కోరారు..కలెక్టర్ సైతం ఒడిశా ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడారు..అయినా ఈ గ్రామాలలో ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు దూరంగా ఉన్నారు..
కొఠియా గ్రామాలలో పోలింగ్ ను అడ్డుకున్న ఒడిశా అధికారులు…
Advertisement
తాజా వార్తలు
Advertisement