విజయనగరం: జిల్లాలోని మహారాజా ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా పునరుద్ధరించామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు… విజయనగరం హాస్పటల్లో నేడు ఆయన అక్కడి పరిస్థితిని సమీక్షించారు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సాంకేతిక లోపం వల్లే ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని అన్నారు. కొన్ని గంటలలోనే సాంకేతిక సమస్యను అధికమించామని తెలిపారు.. ఈ హాస్పటల్లో 25 మంది వెంటిలేషన్ పై చికిత్స పొందుతున్నారని, వారంతా క్షేమంగా ఉన్నారన్నారు.. అక్సిజన్ కొరతతో ఏ ఒక్కరూ మరణించలేదని చెప్పారు.. కాగా, అక్సిజెన్ ను ఉత్పత్తి చేసే రెండు ప్లాంట్ లు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో నిర్వీర్యంగా ఉన్నాయని,. వాటిని పునరుద్ధరించేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారన్నారు. కేంద్రం ఇచ్చిన కోటా ప్రకారం విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ఆక్సిజెన్ తీసుకుంటున్నామన్నారు… అలాగే రాష్ట్ర అవసరాల కోసం ఒడిశా, కర్ణాటక నుంచి ఆక్సిజన్ రప్పిస్తున్నామని చెప్పారు. అందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement