Saturday, November 23, 2024

గరివిడిలో జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ : కలెక్టర్‌ సూర్యకుమారి

విజయనగరం : అన్ని వసతులతో గరివిడిలో జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్‌ను రూపొందించాలని జిల్లా కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో సుమారు 22 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్న గరివిడి ఎంఐజీ లేఅవుట్‌కు సంబంధించి, ధర నిర్ణయ కమిటీ- సమావేశం కలెక్టర్‌ ఛాంబర్‌లో బుధవారం జరిగింది. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ లేఅవుట్‌లో చదరపు గజం ధరను రూ.7,700గా నిర్ణయించారు. మొత్తం 272 ప్లాట్లతో గరివిడి పట్టణంలో ఈ లేఅవుట్‌ రూపొందించనున్నారు. సమావేశంలో కమిటీ- ఛైర్‌ పర్సన్‌, జిల్లా కలెక్టర్‌ సూర్యకుమారి మాట్లాడుతూ అన్ని వసతులతో, వీలైనంత త్వరగా లేఅవుట్‌ను రూపొందించాలని ఆదేశించారు. వీలైతే సోలార్‌ స్ట్రీట్‌ లైటింగ్‌ను కూడా ఏర్పాటు- చేయాలని సూచించారు. లేఅవుట్‌ వివరాలను పొందుపరుస్తూ ప్రధాన రహదారిపై భారీ హోర్డింగ్‌ను ఏర్పాటు- చేయాలన్నారు. కొనుగోలుదారులు సులువుగా రుణం పొందేందుకు వీలుగా ఏదైనా బ్యాంకును అనుసంధానం చేయాలన్నారు. అన్ని సదుపాయాలతో లేఅవుట్‌ను అభివృద్ది చేసిన తరువాతే దరఖాస్తుల ప్రక్రియ మొదలు పెట్టాలని కలెక్టర్‌ సూచించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌, డిఆర్‌ఓ ఎం.గణపతిరావు, చీపురుపల్లి ఆర్‌డిఓ ఆర్‌.అప్పారావు, విఎంఆర్‌డిఏ ఎస్టేట్‌ ఆఫీసర్‌ లక్ష్మారెడ్డి, సూపరింటిండెంట్‌ ఇంజనీర్‌ వి.భవానీశంకర్‌, గరివిడి తాశీల్దార్‌ తాడ్డి గోవింద, విఎంఆర్‌డిఏ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement