Saturday, November 23, 2024

అభివృద్ధి పనులు త్వరగా గ్రౌండింగ్ చేయాలి : కలెక్టర్ నిశాంత్ కుమార్

పార్వతీపురం : అభివృద్ధి పనులు త్వరగా గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అత్యంత ప్రాధాన్యత పనులకు నామినేషన్ లు, అగ్రిమెంట్ లు, గ్రౌండింగ్ పూర్తి అయిన వాటికి బిల్లులు చెల్లింపులు జరగాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. గురువారం కలెక్టర్ కార్యాలయం నుండి ఎంపీడీవోలు, పంచాయతీ రాజ్, ఆర్.డబ్ల్యూ.ఎస్ అధికారులతో అభివృద్ధి పనుల ప్రగతిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడప గడపకు మన ప్రభుత్వం పనులకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. త్వరగా గౌండింగ్ అయ్యేలా ఎంపీడీఓలు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. క్రాష్ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో తాగునీటి బోర్లు మరమత్తులు చేసి నీటి ఎద్దడి లేకుండా పనులు జరిపించాలని ఆయన ఆదేశించారు. ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, నిర్లక్ష్యంవహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా నిరుద్యోగ యువతకు ఆసక్తి కలిగిన రంగంలో నైపుణ్యాన్ని పెంపొందించి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం స్కిల్ డెవలప్మెంట్ హబ్ లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో కనీసం 30 వేల మంది నిరుద్యోగుల రిజిస్ట్రేషన్ నమోదుకు గ్రామ వాలంటీర్లు, ఎపిఎంలు కృషి చేయాలని ఆయన ఆదేశించారు. నిరుగ్యోగ యువత రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా పంచాయ‌తీ రాజ్ ఇంజనీరింగ్ అధికారి డా.ఎం.వీ.ఆర్.క్రిష్ణా జీ, జిల్లా గ్రామీణ నీటి సరఫరా ఇంజనీరింగ్ అధికారి ప్రభాకర రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement