మక్కువ(విజయనగరం), (ప్రభన్యూస్) : విజయనగరం జిల్లా మక్కువ మండలం శంబర శ్రీ పోలమాంబ అమ్మవారి మారు జాతర మంగళవారం నాడు ఘనంగా జరిగింది. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. చదురు గుడి, వనం గుండిల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు క్యూ లైన్లో నిల్చున్నారు. భక్తులతో వనం గుడి కిక్కిరిసింది. చదురు గుడిలో భక్తుల క్యూ లైన్లు గుండవెల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. గత మంగళవారం శ్రీ పోలమాంబ అమ్మవారి సిరిమానోత్సవం జరిగింది. కరోనా నిబంధనలు చేయడంతో అధికశాతం మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వీలు కుదరలేదు. ఈ నేపథ్యంలో మారు జాతరను పురస్కరించుకొని వేలాది మంది భక్తులు అమ్మ దర్శనార్థం శంబర చేరుకున్నారు. మారు జాతరకి కూడా కరోనా నిబంధనలు పోలీస్ శాఖ కఠినతరం చేసినప్పటికీ, వేలాది మంది భక్తులు ద్విచక్ర వాహనాల పైన, కాలి నడకన నడుచుకుంటూ శంబర చేరుకొని అమ్మవారికి ముడుపులు చెల్లించుకున్నారు. పవిత్ర గోముఖి నదిలో స్నానాలు ఆచరించి, అమ్మవారి దర్శనార్థం క్యూలైన్లకు చేరుకున్నారు. తల నీలాలు సమర్పించుకునే భక్తులు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏర్పాటు-చేసిన ప్రత్యేక కేశఖండన ప్రదేశంలో సమర్పించుకున్నారు. అధిక శాతం మంది మహిళా భక్తులు అమ్మవారికి ముడుపులు మొక్కుబడులు చెల్లించుకున్నారు. వనం గుడి వద్ద అమ్మవారి ప్రతిరూపంగా భావించే వేప చెట్టు-కు ప్రత్యేక పూజలు ఆచరించారు.
మారు జాతర పురస్కరించుకొని 150 మంది పోలీసులతో పోలీస్ శాఖ భద్రతా చర్యలు చేపట్టింది. సాలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎల్ అప్పలనాయుడు పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి భద్రత ఏర్పాట్లు- పర్యవేక్షించారు. మక్కువ ఎస్‌ఐ, కె సీతారాములు తమ సిబ్బందితో కలిసి జాతరలో భద్రతా చర్యలు చేపట్టారు. మారు జాతరను పురస్కరించుకొని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ కార్యనిర్వహణాధికారి బిఎల్ నగేష్ భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు- చేపట్టారు. క్యూ లైన్ లో నిలిచునే భక్తులకు తాగునీటి సరఫరా చేశారు. ప్రసాదాలు అందుబాటు-లో ఉంచారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..