విజయనగరం జిల్లాలోని మునిసిపల్ ఎన్నికల పోలింగ్ నేటి ఉదయం ప్రారంభమైంది… ఓటర్లు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు… విజయనగరం నగర పాలక సంస్థతో పాటు పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, నెల్లిమర్ల మునిసిపాలిటలో పోలింగ్ ఉదయం నుంచి మంద కొడిగా ప్రారంభమైంది. తొలి గంటలో విజయనగరంలో 4.53% , పార్వతీపురంలో 5.27% ,బొబ్బిలిలో 5.52%. సాలూరులో 6.26%,, నెల్లిమర్లలో 6.07% పోలింగ్ నమోదైంది.. మొత్తం మీద జిల్లాలో 8 గంటల సమయానికి 5.02 శాతం పోలింగ్ నమోదైంది.. కాగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ కణపాక యూత్ హాస్టల్ లోని 46/5 బూత్ లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, స్వేచ్ఛగా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని పిలుపు ఇచ్చారు.. ఇక జిల్లా ఎస్పీ రాజకుమారి పోలింగ్ జరుగుతున్న ప్రాంతాలలో పర్యటిస్తూ శాంతి భద్రతలను పరిరక్షిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement