ఎమ్మిగనూరు టౌన్ (ప్రభ న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిత్యావసర ధరలపై విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయి. అందులో ప్రధానంగా ఆయిల్ విక్రయాలపై దృష్టిపెట్టిన విజిలెన్స్ శాఖ శుక్రవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో కూడ దాడులు చేపట్టింది. దాదాపు 7 దుకాణాల్లో నిర్వహించిన దాడుల్లో ఎంఆర్పీ కంటే అధికంగా విక్రయిస్తున్నట్లు గుర్తించి నట్లు విజిలెన్స్ సిఐ శ్రీధర్ తెలిపారు. అయితే పట్టణం సోమప్ప సర్కిల్ లో ని నరహరి ఆయిల్ మర్చెంట్ దుకాణంలో సన్ సుప్రీం, గోల్డ్ విన్నర్ ను ఎంఆర్పీ కనిపించకుండా చెరిపి ఇష్టారాజ్యంగా అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు.
విషయాన్ని తెలుసు కునేందుకు గాను విజిలెన్స్ లో భాగమైన ఫారెస్టు రేంజ్ అధికారి ఖాన్ ఆ దుకాణంలో కొన్ని సరుకులను కొనుగోలు చేశారు. ఆ సందర్భంలో ఎంఆర్పీ కనబడకుండా చెరిపి అధిక ధరలకు విక్రయిస్తున్నారని గుర్తించారు. అమేరకు లీగల్ మెట్రాలజీ. అధికారి శ్రీరామం కేసునమోదు చేసినట్లు తెలిపారు. దాదాపు గా ఏడు దుకాణాల నుండి రూ. 43,500 జరిమాన విధించారు. ఈ దాడుల్లో ఎస్సై జయన్నలు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..