Thursday, September 19, 2024

AP | వంట నూనెల షాపులపై విజిలెన్స్ దాడులు..

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : వంట నూనెల పై కస్టమ్స్ సుంకం పంచే అవకాశం ఉందన్న ఒకారుల నేపథ్యంలో ఇటీవల గణనీయంగా పామాయిల్ ఇతర ఎడిబుల్ ఆయిల్ ధరల్లో పెరుగుదల వచ్చింది. అనూహ్యంగా ఒక్కసారిగా పెరిగిన ఈ ధరలను నియంత్రణలో తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

పెద్ద ఎత్తున అక్రమ నిల్వలు ఉంచి బ్లాక్ మార్కెట్ తరలిస్తున్న వ్యాపారులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కొరడా జూలిపించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిత్యవసర వస్తువులను బ్లాక్ మార్కెట్కు తరలించి ధరలను పెంచే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు.

అకస్మాత్తుగా పెరిగిన అనధికార హోర్డింగ్ ట్రేడింగ్ పై విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సామాన్య వినియోగదారులపై భారం పడకుండా ఉండేందుకు ఈ ఆకస్మిక ధరల పెరుగుదలను నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నారు.

బ్లాక్ మార్కెట్ కు తరలించి తప్పు చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. పండుగల సీజన్లో ఎడిజేబులు హాయిలకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో మిల్లర్లు స్టాక్ లిస్టులు రిటైర్లు అయిపోయి ఏకకాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలను నిర్వహించాలని అన్ని యూనిట్ల వీఆర్వోలకు బిజినెస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలోని 12 యూనిట్ల పరిధిలోని 26 జిల్లాల్లో సుమారు 50 బృందాలతో మిల్లర్లు స్టాక్ లిస్టులు రిటైల్ వ్యాపారులు సూపర్ మార్కెట్లు తయారీ యూనిట్ ల పై అధికారులు ఆకస్మిక తనిఖీలను మంగళవారం నిర్వహించారు. కృత్రిమ కొరతను సృష్టించి నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ హరీష్ గుప్తా ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement