Friday, November 22, 2024

Kadapa | లిక్కర్​ షాపుల్లోనే కల్తీ దందా.. విజిలెన్స్​ దాడుల్లో బయటపడ్డ అక్రమాలు

రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి: వైఎస్సార్ జిల్లా వెంపల్లె పట్టణంలో పలు ప్రభుత్వ మద్యం దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​ మెంట్ అధికారులు శనివారం మెరుపు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో కల్తీ మద్యం అమ్ముతున్న అయిదుగురిని అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా విజిలెన్స్ అసిస్టెంట్ కమిషనర్ మునిస్వామి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దాడుల్లో మద్యం బాటిళ్లపై రేట్ లేబుల్ మార్పు, మద్యం కల్తీ చేస్తున్నట్లు గుర్తించారు. వీరి వద్ద నుండి 378 కల్తీ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement