Sunday, November 24, 2024

ఫ్యాక్ట్ చెక్: సీఎం రమేష్ నిజంగా విమానం కొన్నారా?

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్.. సొంతంగా ఓ విమానాన్ని కొనుగోలు చేసినట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. స్వతహాగా పారిశ్రామికవేత్త అయిన సీఎం రమేష్.. తన వ్యాపార, పారిశ్రామిక లావాదేవీల కోసం తరచూ ఆయన విమానా ప్రయాణాలను చేయాల్సి ఉంటుంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా పరిమితంగా విమానాల రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో ఆయనే సొంతంగా ఓ ఫ్లైట్‌నే కొనేశారు. ఎనిమిది సీట్ల సామర్థ్యంతో కూడుకుని ఉన్న ఛార్టెడ్ ఫ్లైట్ అది. పైలెట్, కోపైలెట్ కాకుండా ఒక ఎయిర్ హోస్టెస్ ఇందులో ఉంటారు. ఈ ఛార్టెడ్ ఫ్లైట్‌కు సీఎం రమేష్..ప్రత్యేక పూజలు చేశారు. టెంకాయ కొట్టారు. అనంతరం టేకాఫ్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తోన్నాయి. అయితే, ఇదంతా ఫేక్ వార్త అని తెలిసింది.

బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఎయిర్ క్రాఫ్ట్ కొన్నారు అని వైరల్ అవుతున్న వార్త పూర్తిగా అవాస్తవం. ఎయిర్ క్రాఫ్ట్ ఓనర్ నూతనంగా కొన్న విమానానికి పూజా కార్యక్రమం నిర్వహించమని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ని ఆహ్వానించారు. ఈ సంధర్భంగా రమేష్ కొబ్బరికాయ కొట్టి ఆ ఎయిర్ క్రాఫ్ట్ ను ప్రారంభించారు. అంతేకానీ సీఎం రమేష్ కి ఆ ఎయిర్ క్రాఫ్ట్ కు ఎటువంటి సంబంధం లేదు అని ఆయన కార్యాలయం ఒక వివరణలో తెలిపింది.

YouTube video

ఇదీ చదవండి: ఫ్యాక్ట్ చెక్: ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు! నిజమేనా?

Advertisement

తాజా వార్తలు

Advertisement