ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి వరద బాధితుల నుంచి నిరసన సెగ తగిలింది. ప్రభుత్వతీరుపై వరద బాధితులు నిరసన గళమెత్తారు. భారీ వర్షాల కారణంగా ఇటీవల అన్నమయ్య జలాశయం కట్టతెగి ముంపునకు గురైన పులపుత్తూరు, మందపల్లి, తొగురుపేట, గుండ్లూరు గ్రామాల్లో సజ్జల పర్యటించిన సందర్భంగా ఆయనను అడ్డుకున్నారు.
వరదల్లో సర్వం కోల్పోయి రోడ్డున పడ్డామని, ప్రభుత్వం ఇస్తున్న పరిహారం ఏమూలకు సరిపోదని పులపుత్తూరు గ్రామస్థులు ఆయన ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ఒక ఏడాదిలో నమోదు కావాల్సిన వర్షం ఒకే రోజు కురవడంతోనే జలాశయాలు కట్టలు తెగి ప్రాణ, ఆస్తినష్టం జరిగిందన్నారు. సర్వే చేసి నష్టపరిహారం చెల్లిస్తామన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital