ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పట్ల ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు దిగ్భ్రాంతికి గురయ్యారు. గౌతమ్ రెడ్డి కుటుంబంతో ఎన్నో ఏళ్ల సాన్నిహిత్యం ఉందన్నారు. తనపై ఎంతో అభిమానం చూపేవారన్నారు. పనిపట్ల నిబద్దత కలిగిన నాయకుడు గౌతమ్ రెడ్డి అన్నారు. చిన్న వయసులోనే మృతిచెందడం బాధకరమన్నారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital