భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నాలుగు రోజుల పర్యటన నిమిత్తం విశాఖపట్నం చేరుకున్నారు. ఆయనకు ఏపీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తూర్పు నౌకాదళం అధిపతి వైస్ అడ్మిరల్ ఏబీ సింగ్ స్వాగతం పలికారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 29 వరకు విశాఖలో జరిగే అనేక కార్యక్రమాల్లో వెంకయ్యనాయుడు పాల్గొంటారు. సతీసమేతంగా విచ్చేసిన ఆయన నగరంలో ఉన్నన్నాళ్లు పోర్టు గెస్ట్ హౌస్ లో బస చేయనున్నారు. విశాఖ వచ్చిన ఉపరాష్ట్రపతికి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.
ఇదీ చదవండి: టీటీడీకి కొత్త బోర్డు ఏర్పాటు చేయండి: జగన్కు రఘురామ లేఖ