Thursday, January 30, 2025

Accepted – ఎపిలో ఒక రాజ్య‌స‌భ సీటు ఖాళీ … విజ‌య‌సాయి రాజీనామా ఆమోదం

అమ‌రావ‌తి – వైసిపి కీల‌క నేత విజయసాయిరెడ్డి రాజ్యసభ స‌భ్య‌త్వానికి చేసిన రాజీనామాను రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌క‌డ్‌ ఆమోదించారు. తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మట్ లో అందజేయడంతో ఆ రాజీనామాను ఉప రాష్ట్రపతి వెంటనే ఆమోదించారు. ఈ మేర‌కు రాజ్య‌స‌భ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ బులెటిన్ విడుద‌ల చేశారు.

కాగా రాజీనామా చేసిన తరువాత విజయసాయి మీడియాతో మాట్లాడుతూ… పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేశానని అన్నారు. ఇక భవిష్యత్తులో రాజకీయాల గురించి మాట్లాడనని, పూర్తిగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటాన‌ని తెలిపారు. తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా అప్రూవర్‌గా మారలేదని చెప్పిన విజయసాయి వెన్నుపోటు రాజకీయాలు తనకు తెలియవని పేర్కొన్నారు.

అదే స‌మ‌యంలో కేసుల నుంచి బయటపడడానికే తాను రాజీనామా చేశానంటూ వస్తున్న విమర్శలపై ఆయ‌న‌ ఘాటుగా స్పందించారు. ఎవరి చేతో కేసులు మాఫీ చేయించుకోవాల్సిన పరిస్థితుల్లో తాను లేనని చెప్పారు.

- Advertisement -

అది వారి అంతర్గత విషయం .. చంద్రబాబు

రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంపై ఏపీ ముఖ్యమంత్రి స్పందించారు. ఎవరికైనా నమ్మకం ఉంటేనే పార్టీలో ఉంటారని… లేకపోతే వెళ్లిపోతారని చంద్రబాబు అన్నారు. పార్టీ పరిస్థితి కూడా చాలా ముఖ్యమని అన్నారు. ఇది వైసీపీ వ్యక్తిగత అంశమని చెప్పారు. వ్యక్తిగత కోపంతో వ్యవస్థలను నాశనం చేసిన పరిస్థితి ఏపీలో తప్ప దేశంలో మరెక్కడా లేదని అన్నారు. రాజకీయాల్లో ఉండేందుకు అర్హత లేని వ్యక్తులు వస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement