Thursday, September 12, 2024

Venkatachalam – వెంకయ్య నాయుడి సేవ‌లు ప్ర‌శంస‌నీయం … ఉప రాష్ట్రపతి

గ్రామీణ భార‌తానికి ట్ర‌స్ట్ ప్రాధాన్యం
ప్ర‌జా సంక్షేమం కోస‌మే వెంక‌య్య జీవితం
స్వ‌ర్ణ భార‌త్ ట్ర‌స్ట్ వార్షికోత్స‌వంలో ఉప‌రాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌డ్..

ఆంధ‌ప్ర‌భ స్మార్ట్ – నెల్లూరు – సంక్షేమ కార్యక్రమాల కోసం వెంకయ్యనాయుడు జీవితం అంకితం చేశార‌ని, . గ్రామీణ భారతంలో సేవకు ఆయన అంకితమయ్యార‌ని ప్ర‌శంసించారు ఉప రాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌డ్….. వెంక‌టాచ‌లంలోని స్వర్ణభారత్‌ ట్రస్టు 23వ వార్షికోత్సవ సభలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. .. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ, వెంక‌య్య‌నాయుడి వంటి సామాజిక వేత్త‌ల వ‌ల్ల సమరయోధుల కలలు నేడు సాకారమవుతున్నాయ‌ని కొనియాడారు. అలాగే స్వ‌ర్ణ భార‌తి ట్ర‌స్ట్ గ్రామీణ ప్రాంతాల‌కు చేస్తున్న సేవ‌ల‌పై ప్ర‌శంసలు కురిపించారు..

- Advertisement -

కాగా, : భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ శనివారం ఉదయం నెల్లూరు జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని వెంకటాచలంలో ఉన్న అక్షర విద్యాలయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతి దంపతులకు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, స్వర్ణభారత్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ ఘన స్వాగతం పలికారు.

అక్షర విద్యాలయం ఆవరణలో ఉన్న స్వామి వివేకానందుని ప్రతిమకు ఉపరాష్ట్రపతి నివాళులు అర్పించారు. అనంతరం అక్షర విద్యాలయం ఆవరణలో ఉన్న సర్దార్ వల్లభ భాయ్ పటేల్ విగ్రహానికి కూడా జగదీప్ ధన్‌ఖడ్ నివాళులర్పించారు. ఆపై అక్షర విద్యాలయంలోని చిన్నారులతో ముచ్చటించారు. వారి సాంస్కృతిక కార్యక్రమాలు ఉపరాష్ట్రపతి, పూర్వ ఉపరాష్ట్రపతి తిలకించారు. ఉపరాష్ట్రపతితో పాటు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి ఆనంరామనారాయణ రెడ్డి అక్షర విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లు…

కాగా.. జిల్లాలో పర్యటన నిమిత్తం ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి ఉపరాష్ట్రపతి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బయలుదేరి నెల్లూరులోని పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వెంకటాచలంలోని అక్షర విద్యాలయం చేరుకున్నారు.. ఆ కార్య‌క్ర‌మం అయిన వెంట‌నే ఆయ‌న హెలికాఫ్ట‌ర్ లో తిరిగి శంషాబాద్ కు చేరుకున్నారు. న్యూ ఢిల్లీ బయలుదేరిన ఉప రాష్ట్రపతికి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ శర్మ, రాష్ట్ర రవాణా, బీ.సి.సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు హర్కారా వేణుగోపాల్, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, రంగ రెడ్డి జిల్లా కలెక్టర్ తదితరులు క‌లిసి ఘ‌నంగా వీడ్కొలు ప‌లికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement