Saturday, January 11, 2025

Pongal Tour | మట్టి వాసన కోసం నగర వాసులు పరుగు !

  • జాతీయ రహదారిపై బారులు తీరిన‌ వాహనాలు

సంక్రాంతి పండుగ సందర్భంగా న‌గ‌రమంతా ప‌ల్లె బ‌ట ప‌ట్టింది. తెలంగాణలో శనివారం నుంచి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో పిల్లలతో పాటు కుటుంబ సభ్యులంతా కార్లు, ఇతర వాహనాల్లో సొంతూళ్ల‌కు ప‌య‌న‌మ‌య్యారు. దీంతో ఒక్కసారిగా వేలాది వాహనాలు రోడ్డెక్కాయి.

ఈ క్ర‌మంలో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు రద్దీ భారీగా పెరిగింది. పంతంగి టోల్ గేట్ వద్ద వాహనాలు బారులు తీరాయి. ఈటోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు వెళ్లే మార్గంలో సాధారణంగా 8 టోల్ బూత్‌లు తెరిచి ఉంటాయి. సంక్రాంతి కోసం వాహనాలు బారులు తీరిన నేపథ్యంలో మరో రెండు బూత్‌లను తెరిచారు. ఇక‌ చౌటుప్పల్‌లో ఫ్లైఓవర్ లేకపోవడంతో ఇక్కడ కూడా ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు అంతరాయం కలగకుండా విధులు నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement