Monday, November 25, 2024

వైవీయూ డాక్టరేట్ విద్యార్థులు జాబితా విడుదల చేసిన వీసీ ఆచార్య మునగల సూర్యకళావతి..

యోగివేమన విశ్వవిద్యాలయం 9, 10 కాన్వకేషన్లో డాక్టరేట్ అందుకునే పరిశోధకుల జాబితాను విశ్వవిద్యాలయ ఉపకుల పతి ఆచార్య మునగల సూర్యకళావతి విడుదల చేశారు. వివిధ శాఖల నుంచి పలు రంగాల్లో పరిశోధనలు పూర్తి చేసిన 28 మంది పరిశోధకులకు ఈ నెల 20వ తేదీన జరిగే యోగివేమన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయ సచివులు బిశ్వభూషణ్ హరిచందన్, రాష్ట్ర విద్యామంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సమక్షంలో డాక్టరేట్ పట్టాలను అందజేయనున్నామని తెలిపారు. విశ్వవిద్యాలయం ప్రారంభం నుంచే పరిశోధనకు పెద్దపీఠ వేసిన విశ్వవిద్యాలయం అధ్యాపకులు నిరంతరం పరిశోధనలను కొనసాగిస్తూ పరిశోధక విద్యార్థులకు చక్కటి మార్గనిర్దేశకత్వం చేస్తున్నారని చెప్పారు. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ భవిష్యత్తు తరానికి ప్రయోజనాన్ని అందించే అంశాలపై పరిశోధనలు జరిగాయని, రానున్న రోజుల్లో ఇవి కొనసాగుతాయన్నారు. డాక్టరేట్ అందుకోబోతున్న విద్యార్థులకు ఈ సందర్భంగా వీసీ ఆచార్య మునగల సూర్యకళావతి, కులసచివులు ఆచార్య దుర్భాక విజయరాఘవ ప్రసాద్, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టరు ఎన్. ఈశ్వరరెడ్డి అభినందనలు తెలిపారు.

9,10 కాన్వకేషన్లో వరిశోధకుల పేర్లు వారు పరిశోధన సాగించిన సబ్జెక్టులు..
ఎడమకంటి తిరుపతి (తెలుగు) అరుణ్ కుమార్ పెరుమాళ్ల (తెలుగు) కె.లింగమయ్య గౌడ్ (తెలుగు), అన్నెం అశ్వర్థ రెడ్డి (సైకాలజి), జింకా శివకుమార్ (జెనటిక్స్ అండ్ జీనోమిక్స్), తొండలదిన్నె మస్తాన్ (ఎన్విరాన్మెంటల్ సైన్సు), లక్కిరెడ్డి నాగి రెడ్డి (ఎన్విరాన్మెంటల్ సైన్సు), షేక్ మస్తాన్ (కామర్సు), పి.జాన్ ఏలియ ప్రశాంత్ (జెనెటిక్స్ అండ్ జీనోమిక్స్), జి.రామాంజనేయులు (బిజినెస్ మేనేజిమెంట్), బి.బాలాజినాయక్ (ఎకనామిక్స్), ఎన్.వెంకటసుబ్బమ్మ (ఇంగ్లీష్), కె.సాంసన్ ప్రవీణ్ కుమార్ (మెకానికల్ ఇంజినీరింగు), డేరంగుల మాధవి (జువాలజి), కేతినేని సుబ్బరాయుడు (అప్లైడ్ మేథమేటిక్స్), అబ్బిగాళ్ల పిచ్చయ్య (ఎకనామిక్స్ ), రాతిరాజు లక్ష్మీదేవి (అప్లైడ్ మ్యాథమేటిక్స్), పోచిరెడ్డి దేవికాదేవి (బిజినెస్ మేనేజిమెంట్), గుల్లా సురేంద్ర (బయోటెక్నాలజీ అండ్ బయో ఇన్ఫర్మేటిక్స్), పి.రంగనాథరెడ్డి (అప్లైడ్ మేథమేటిక్స్), జి.రాజేశ్వరి(అప్లైడ్ మేథమేటిక్స్), గూడూరు శివజ్యోతి ( ఎకనామిక్స్), మొందం మునిరాజ (బోటనీ), జె.అజాని (బయోకెమిస్ట్రీ), గుడ్డివాళ్ల బాబు (హిస్టరీ అండ్ ఆర్కియాలజి), సిగిలిరేవు రామాంజనేయులు (తెలుగు), కె.ప్రసాద్ (ఫైన్ ఆర్ట్స్), ఎన్.ఉమాదేవి (కెమిస్ట్రీ)లకు డాక్టరేట్లు ప్రధానం చేయనున్నామని వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement