అమరావతి – అమ్మనే గెంటేసినవాడికి అంగన్వాడీల విలువ ఎం తెలుస్తుంది? పాదయాత్రలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమని శాంతియుత నిరసనలు తెలపడం కూడా నేరమేనా? అంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సిఎం ను ప్రశ్నించారు..అంగన్వాడీల సమ్మెను నిషేదిస్తూ ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.
అంగన్వాడీ ఉద్యమం పై సైకో సర్కార్ ఉక్కుపాదం మోపడం దారుణం. అంగన్వాడీల పై ఎస్మా ప్రయోగం, సమ్మె కాలానికి వేతనంలో కోత పెట్టడం.. జగన్ నియంత పోకడలకు పరాకాష్ట. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ వైకాపా ప్రభుత్వం తెచ్చిన జిఓ నెంబర్ 2 తక్షణమే ఉపసంహరించుకోవాలి. అంగన్వాడీల ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది. జగన్ అహంకారానికి…అంగన్వాడీల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఉద్యమంలో అంతిమ విజయం అంగన్వాడీలదే. అంటూ ట్విట్ చేశారు.
ఎస్మా ప్రయోగించినా సమ్మె విరమించేది లేదు…
అంగన్వాడీలు న్యాయపరమైన తమ డిమాండ్లు పరిష్కరించే వరకూ సమ్మెను విరమించేది లేదని అంగన్వాడీలు తేల్చి చెప్పారు.. తమపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై విజయవాడలో అంగన్వాడీ నేతలు స్పందిస్తూ,ఎస్మాకు భయపడేది లేదన్నారు.. 38 రోజులుగా తాము సమ్మె చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం చివరకు తమ డిమాండ్లను పరిష్కరించకపోగా తమపై ఎస్మాను ప్రయోగించడమేమటని మండిపడ్డారు.