తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనంటోకెన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతిచెందగా, అనేక మంది గాయపడ్డ విషయం తెలిసిందే. కాగా, ఇవాళ వైకుంఠ ఏకాదశి సందర్భంగా.. ఆ తొక్కిసలాటలో గాయపడ్డ భక్తులు ఇవాళ దర్శనం కల్పించారు. సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మెన్ ఆదేశాల ప్రకారం.. తొక్కిసలాటలో గాయపడ్డవారికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు.
అధికారుల ప్రకారం గాయపడ్డ వారిలో మొత్తం 52 మందికి ప్రత్యేకంగా ఉత్తరద్వార దర్శనం కల్పించారు.