కరోనా వైరస్ అదుపుకు ఏపీ ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటికే రికార్డు స్థాయిలో టీకాలు పంపిణీ చేశారు. ఫస్ట్, సెంకడ్ డోసులను వేస్తున్నారు. కరోనా కట్టడికి వ్యాక్సిన్ రెండు డోస్ లు తప్పని సరి. కోవాగ్జిన్ మొదటి డోస్ పూర్తయిన 42, కోవిషీల్డ్ మొదటి డోస్ పూర్తయిన 84 రోజులకు రెండో డోస్ తీసుకోవాలని నిబంధన పెట్టారు. ఈ నేపథ్యంలో రెండో డోస్ తీసుకోవాలని సెల్ ఫోన్ లకు సందేశాలు పంపుతు అలెర్ట్ మెసేజ్ లు పంపటం సహజమే.
అయితే, మంగళగిరిలో మాత్రం ఫస్ట్ డోసు తీసుకున్న వారు రెండో డోస్ తీసుకోకపోయిన.. వ్యాక్సిన్ తీసుకున్నట్లు ఫోన్ లో సందేశాలు వస్తున్నాయి. అలెర్ట్ మెసేజ్ లు పంపిన మరుసటి రోజు రెండు డోస్ పూర్తయినట్లు మెసేజ్ సర్టిఫికెట్ వస్తున్నాయి. రెండో డోస్ పూర్తి కాకుండా ఇలా సందేశాలు పంపితే మొదటి డోస్ గడువు పూర్తయ్యాక రెండో డోస్ కోసం వెళితే వ్యాక్సిన్ ఇచ్చే పరిస్థితి ఉండదు కదా అని ప్రజలు అంటున్నారు.
ఇది కూడా చదవండి: వైద్యం కోసం వెళితే గెటవుట్.. ప్రభుత్వ వైద్యశాలలో ఎంపీపీకి అవమానం