Sunday, November 24, 2024

Uttarandhra Bus Yatra – సామాజిక సాధికారతతోనే సంక్షేమ సాధన – వైస్సార్సీపీ

శ్రీకాకుళం, అక్టోబర్ 27(ప్రభ న్యూస్): సామాజిక సాధికారతతోనే సంక్షేమ సాధన సాధ్యమౌతుందని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నిరూపించారని మీడియాతో వైస్సార్సీపీ ముఖ్యనాయకులు తెలిపారు . గురువారం ఇచ్చాపురంలో సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభమవుతున్న సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయం వద్ద మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో ముందుగా జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ, సామాజిక బస్ యాత్ర లో వైస్సార్సీపీ ముఖ్య నాయకులు, అన్ని వర్గాల వారు పాల్గొనాలని సూచించారు. సీఎం వైఎస్ జగన్ బీసీ సాధికారతే లక్ష్యంగా ఐదుగురు బీసీ ఉప ముఖ్యమంత్రులు, 56 కార్పొరేషన్ చైర్మన్ ల ను నియమించారన్నారు. ఎవరి సిఫార్సు లేకుండా ప్రజలకు పథకాలు అందుతున్నాయన్నారు. మేనిఫెస్టో ను ఖురాన్, బైబిల్, భగవత్ గీత గా భావించి అమలు చేసామని తెలిపారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం ప్రాధాన్యత రంగాలుగా తీసుకున్నామన్నారు. అత్యంత సమర్ధవంతంగా భూముల రీసర్వే చేపట్టామన్నారు. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సీఎం జగన్ పాలనలో సాకారమైందన్నారు. ఆరోగ్య సురక్ష పథకం లో ప్రజల ఆరోగ్యం పై వీధి వీధి న జల్లెడ పట్టి వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ఈ విషయాలు సామాజిక సదస్సుల్లో వివరిస్తామన్నారు. అన్ని నియోజక వర్గాలులో దశలవారీగా యాత్ర నిర్వహిస్తామన్నారు.

నాడు నేడు ద్వారా విద్యా సాధాకారత సాధించామన్నారు. రైతు భరోసా కేంద్రాలు ద్వారా వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలిచామన్నారు. వంశధార ప్రాజెక్ట్ ను సమర్థవంతంగా నడుపుతున్నామని చెప్పారు. సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్ట్ నిర్మాణం శరవేగం గా జరుగుతోందన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఇచ్ఛాపురం నుండి ప్రారంభం అయిన సామాజిక సాధికార యాత్రను జయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలే కాకుండా మరికొన్ని హామీలు కూడా నెరవేర్చామన్నారు. నాలుగున్నరేళ్లు గా ఏమీ చేసామో ఈ యాత్ర ద్వారా మరో సారి చెప్పాలనుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రం లో ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర ను బట్టబయలు చేస్తామన్నారు. బడుగులకు భరోసా కల్పించామని వివరించారు. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ ఈ రాష్ట్రం లో సంక్షేమ పాలన సాగుతోందన్నారు. రాష్ట్రంలో పేదరికం 12 శాతం నుండి 6 శాతానికి తగ్గిందని తెలిపారు. పేదవారి పక్షాన సీఎం జగన్, పెత్తందార్ల పక్షాన చంద్రబాబు ఉన్నారని చెప్పాలన్నారు. ఈ సమాజానికి పనికొచ్చే నాయకుడు జగన్ ఈ రాష్ట్రానికి దొరికారన్నారు. పాలకొండ ఎమ్మెల్యే వి కళావతి మాట్లాడుతూ సీఎం జగన్ అన్ని వర్గాలకు సమ న్యాయం చేస్తున్నారన్నారు. ప్రజల దీవెనలు సీఎం జగన్ కు ఉండాలన్నారు. గిరిజన సంక్షేమం జగన్ వల్ల సాధ్యమైంది. గిరిజనులు గర్వపడేలా చేశారన్నారు. గిరిజనులకు ఉప ముఖ్యమంత్రి, మంత్రి పదవి దక్కిందన్నారు. గిరిజన కమిషన్ లో మేధావులను నియమించారని వివరించారు.

ఈ ప్రెస్ మీట్ లో పార్టీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, డాక్టర్ సీదిరి అప్పలరాజుమేరుగ నాగార్జున, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే వి కళావతి, గొర్లె కిరణ్ కుమార్, ఎంఎల్సీ లు దువ్వాడ శ్రీనివాస్, వరుదు కల్యాణి, కుంబా రవిబాబు, యువనేత డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య, కార్పొరేషన్ చైర్మన్లు మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, మెంటాడ స్వరూప్, మాజీ కేంద్రమంత్రి దాక్టర్ కిల్లి కృపారాణి, డిసిసిబి చైర్మన్ కరిమిరాజేశ్వరరావు, పలాస మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement