Saturday, September 28, 2024

Uravakonda … ఆయ‌న ఓడిపోవాల‌ని! కోటి మొక్కులు మొక్కారు

ఆయ‌న ఓడాల్సిందే.. ఓడి తీరాల్సిందే. మేం ఓడిస్తాం… ఇలా పంతం ప‌ట్టింది తెలుగు త‌మ్ముళ్లే.. సొంత పార్టీ అభ్య‌ర్ధి అప‌జ‌యానికి కంక‌ణం క‌ట్టుకుని మ‌రీ ప్ర‌చారం కూడా చేశారు. విన‌డానికి విచిత్రంగా ఉన్నా ఇది మాత్రం వాస్త‌వ‌మే.. నిజం కూడా. ఎందుకంటే ఆ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల్లో ఓ అప‌న‌మ్మ‌కం ఉంది. చాలాకాలంగా వ‌స్తున్న సెంటిమెంట్ అని కూడా చెప్పుకోవ‌చ్చు. దాంతో ఆ సెగ్మెంట్‌లో సొంత‌పార్టీ అభ్య‌ర్థి ఓడిపోవాల‌ని కోటి దేవుళ్ల‌కు నూటొక్క మొక్కులు మొక్కారు.

క‌నిపించిన ప్ర‌తి ఆల‌యం మెట్లెక్కారు
ఆఖ‌రికి పొర్లు దండాలు పెట్టారు
అష్ట్రోత్రాలు, స‌హ‌స్ర నామాలు ప‌టించారు
దేవుని విగ్ర‌హాల వ‌ద్ద కొబ్బ‌రి కాయ‌లు కొట్టారు
పోటీ చేస్తున్న నియోజ‌క‌వ‌ర్గంలో వ్యతిరేక ప్ర‌చారం చేశారు
ఏపీలోని ఉర‌వ‌కొండ స్థానంలో ఓ వింత క‌థ
సెంటిమెంట్ అంటున్న తెలుగుదేశం అభిమానులు

- Advertisement -

ఆయ‌న ఓడాల్సిందే.. ఓడి తీరాల్సిందే. మేం ఓడిస్తాం… ఇలా పంతం ప‌ట్టింది తెలుగు త‌మ్ముళ్లే.. సొంత పార్టీ అభ్య‌ర్ధి అప‌జ‌యానికి కంక‌ణం క‌ట్టుకుని మ‌రీ ప్ర‌చారం కూడా చేశారు. విన‌డానికి విచిత్రంగా ఉన్నా ఇది మాత్రం వాస్త‌వ‌మే.. నిజం కూడా. ఎందుకంటే ఆ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల్లో ఓ అప‌న‌మ్మ‌కం ఉంది. చాలాకాలంగా వ‌స్తున్న సెంటిమెంట్ అని కూడా చెప్పుకోవ‌చ్చు. దాంతో ఆ సెగ్మెంట్‌లో సొంత‌పార్టీ అభ్య‌ర్థి ఓడిపోవాల‌ని కోటి దేవుళ్ల‌కు నూటొక్క మొక్కులు మొక్కారు.

అక్క‌డి గెలిస్తే అధికారం దూర‌మే..

ఈ సెంటిమెంట్‌తో టీడీపీ నేత‌లు తెగ భ‌య‌ప‌డ్డారు. ఆయ‌న గెలిస్తే అధికారం ద‌క్క‌ద‌ని వ‌ణికి పోయారు.. ఈ సెంటిమెంట్ ఏళ్లకు ఏళ్లుగా వ‌స్తోంది. ఇంతకూ ఇలాంటి విచిత్రమైన సీన్ ఎక్కడ చోటు చేసుకుంది? కరడుకట్టిన తెలుగుదేశం అభిమాని సైతం ఓడిపోవాలనుకున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరంటే పయ్యావుల కేశవ్. అందరిది ఒక దారి అయితే.. పయ్యావుల పరిస్థితి మరోలాంటిది. ఆయనకు వచ్చిన కష్టం ఇంకెవరికీ రాకూడదు. ఉర‌వ‌కొండ‌ స్థానం నుంచి ప‌య్యావుల గెలిచిన ప్ర‌తిసారి టీడీపీ ప్ర‌తిప‌క్షానికే ప‌రిమిత‌మైందనేది చాలామంది లీడ‌ర్ల వాద‌న‌.

ఇదోర‌కం సెంటిమెంట్

ఉరవకొండలో అందులో పయ్యావుల కేశవ్ గెలిస్తే.. తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని.. అధికారం చేజారుతుంద‌ని ఒక బలమైన సెంటిమెంట్ ఉంది. ఈ కారణంగా పార్టీని అమితంగా ఆరాధించే వారు మొదలు పార్టీ కార్యకర్త వరకు పయ్యావుల కేశవ్ మాత్రం ఎన్నికల్లో ఓడిపోవాలని ప్రార్థించిన‌ట్టు తెలుస్తోంది. దీనికి కారణం ఒక సీటు పోయినా.. పార్టీ అధికారంలోకి వస్తుందన్న ఆశ వారికి ఉండ‌డ‌మే. అందుకే ఓడాల‌ని కోటి మొక్కులు మొక్కారు… క‌నిపించిన ప్ర‌తి ఆల‌యం మెట్లెక్కారు.. పూజ‌లు, అర్చ‌న‌లు, మోకాళ్ల‌పై న‌డ‌వ‌డాలు చేసేశారు.. ఇక నియోజ‌క‌వ‌ర్గంలోనూ వ్య‌తిరేక ప్ర‌చారమూ చేసిన‌ట్టు తెలుస్తోంది.

పార్టీకి వీర విధేయుడు..

పార్టీపై పయ్యావుల కమిట్ మెంట్‌ క్వశ్చన్ చేయలేనిది. కంచు కంఠం.. ప్రత్యర్థులపై విరుచుకుపడే తీరు.. ఆయన ప్ర‌శ్నించే వైనం అందరినీ ఆకట్టుకుంటాయి. తెలుగుదేశం పార్టీలో సబ్జెక్టు మాట్లాడే అతికొద్ది మంది నేతల్లో పయ్యావుల కేశవ్ ఒకరు. అలాంటి లీడ‌ర్‌ని ఎన్నికల్లో ఓడిపోవాలని తెలుగుదేశం పార్టీకి చెందిన వారంతా కోరుకున్నారు. ఆ మాటకు వస్తే దేవుడికి ప్రార్థనలు చేశారు. ఇదంతా వినేందుకు.. చదివేందుకు బాగానే ఉన్నా.. దాన్ని అనుభవించే వారి మానసిక పరిస్థితి గురించి ఆలోచించినప్పుడు మాత్రం అయ్యో అనుకోకుండా ఉండలేం. సుదీర్ఘకాలంగా పార్టీలో ఉండి శాపగ్రస్త జీవితాన్ని ఆయన అనుభవించారు. అధికారం రాక‌పోవ‌డంతో మంత్రి పదవి కూడా దక్కింది లేదు.

శాప విమోచ‌నం..
అయితే.. విధి చాలా విచిత్రమైనది. ఏళ్లకు ఏళ్లుగా నడుస్తున్న సెంటిమెంట్ కారణంగా తన పొలిటికల్ కెరీర్‌లో తీవ్రంగా నష్టపోయిన పయ్యావులకు ఎట్టకేకలకు శాపవిమోచనం జరిగినట్లుగా తాజా ఫలితం క‌నిపిస్తోంది. ఈ సెంటిమెంట్ విషయంలో తానేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండేవారు కేశవ్. దీనికి తోడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఓడిపోయి ఉండటం కారణంగా.. సరైన అవకాశం ఇప్పటివరకు దక్కలేదు. తాజా ఎన్నికల ఫలితం పుణ్యమా అని.. ఇంతకాలం నడిచిన నమ్మకం సడలిపోయింది. ఆయనపై ఉన్న శాపం తొలిగిపోయింది. ప‌య్యావుల కేశ‌వ్ గెలిచారు. పార్టీ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో.. తెలుగుదేశం అభిమానుల్లో సంతోషం నెల‌కొంది. ఎందుకుంటే.. ఎంతటి గడ్డు పరిస్థితుల్లోనూ పార్టీని వీడిపోకుండా.. నిస్వార్థంగా పోరాడిన పయ్యావులకు ఎట్టకేలకు మంచి రోజులు వచ్చాయని చాలామంది అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement