Thursday, November 21, 2024

Nandyala | యురేనియం తవ్వకాలను ఆపాలి…

వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన
నంద్యాల బ్యూరో, నవంబర్ 21 : నంద్యాల‌ జిల్లా పరిధిలో గల ప్యాపిలి మండలంలోని పలు గ్రామాల‌ ప్రజలు యురేనియం తవ్వకాలపై రోడ్డెక్కారు. గురువారం ప్యాపిలి మండల కేంద్రంలో, జెక్కసాని కుంట్ల, మామిళ్ళపల్లి, రామాపురంలో ప్రజలు మండల కేంద్రానికి వచ్చి రోడ్డుపై నిరసన కార్య‌క్ర‌మం చేపట్టారు. ఆరోగ్యానికి హాని కలిగించే యురేనియం తవ్వకాలను తవ్వడానికి కేంద్ర ప్రభుత్వం 5వేల కోట్లతో టెండర్ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని సీపీఐ ఆధ్వర్యంలో ప్రజలు ఆందోళన చేశారు.

పోలీసులు ర్యాలీ, ధర్నాలను అడ్డుకున్నారు. సీపీఐ జిల్లా నాయకులు, కార్యకర్తలు ఆయా గ్రామాల ప్రజలు వేలాది మందిగా తరలివచ్చి ధర్నాలో పాల్గొన్నారు. ధర్నాలతో మా ప్రాణాలు పోవాలా… అంటూ ప్రశ్నించారు. ఒకానొక దశలో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వామపక్షాల నాయకులు ఏమాత్రం తగ్గకుండా ధ‌ర్నాలో పాల్గొన్నారు. సీపీఐ జిల్లా నాయకుడు రంగ నాయుడు ఆధ్వర్యంలో త‌హ‌సీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement