Saturday, November 23, 2024

AP | కప్పట్రాళ్లలో యురేనియం రగడ… తవ్వకాలు వద్దంటూ ఆందోళన

కర్నూలు బ్యూరో : కర్నూలు జిల్లాలోని మారుపేరైన కప్పట్రాళ్ల గ్రామంలో యురేనియం తవ్వకాలు చేపట్టకూడదని గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. ఈ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు జరిపేందుకు ఇటీవల కేంద్రం అనుమతించింది. దీంతో కప్పట్రాళ్ల రక్షిత అటవీ ప్రాంతంలో యరేనియం తవ్వకాలు జరిపేందుకు 68బోర్లను సిద్ధం చేశారు.

ఈ విషయం తెలుసుకున్న దేవనకొండ మండలానికి చెందిన 15 గ్రామాల ప్రజలు గత కొన్ని రోజులుగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వీరికి మద్దతుగా ఇప్పటికే రాజకీయ పార్టీలు కూడా నిలుస్తున్నాయి. ఇక యురేనియం తవ్వకాలు చేపట్టడం వల్ల పర్యావరణం కలుషితం అవ్వడంతో పాటు తాము అన్ని విధాలుగా నష్టపోతామని గ్రామస్తులు ఆందోళనకు దిగారు.

యురేనియం తవ్వకాల అనుమతులు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కప్పట్రాళ్ల బస్ స్టాప్ వద్ద శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షి వీరికి మద్దతుగా నిలిచారు. ధర్నాలో పాల్గొన్నారు. యురేనియం తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement