Saturday, November 23, 2024

సీఎఫ్‌ఎంఎస్‌ పోర్టల్‌ను అప్‌డేట్‌ చేయండి.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్‌ విజ్ఞప్తి

అమరావతి, ఆంధ్రప్రభ : సీఎఫ్‌ఎంఎస్‌ పోర్టల్‌లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల నూతన పేస్కేళ్ళ జతపరచడానికి సాంకేతిక విధి విధానాలు స్పష్టంగా తెలియపరచాలని ఖజానా మరియు పద్దుల శాఖ అధికారులకు గ్రామ, వార్డు సచివాలయ ఫెడరేషన్‌ నేతలు వినతిపత్రం అందించారు. ఈమేరకు బుధవారం గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ తరపున రాష్ట్ర అధ్యక్షులు ఎండీ జానిపాషా నేతృత్వంలో సీఎఫ్‌ఎంఎస్‌ అడిషనల్‌ సీఈవో సునీల్‌ కుమార్‌ రెడ్డి మరియు డైరెక్టర్‌ ఆఫ్‌ టెజరీస్‌ యన్‌ మోహన్‌ రావులను కలిసి వినతిపత్రం అందజేశారు. సీఎఫ్‌ఎంఎస్‌ హెర్బ్‌ పోర్టల్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బేసిక్‌ పే మార్పు గురించి డీడీఓలకు తగిన సూచనలు జారీ చేయవలసిందిగా వారిని కోరారు.

సీఎఫ్‌ఎంఎస్‌ హెర్బ్‌లో బేసిక్‌ పే మార్పు గురించి చెలామణిలో ఉన్న పీడీఎఫ్‌ ప్లnో చార్ట్‌లు తప్పని తెలియజేశారు. కనుక ఈపోర్టల్‌లో బేసిక్‌ పేలో తగిన మార్పులు చేయకుండా కొత్త జీతాల బిల్లు పెట్టడం కుదరదని వివరించారు. ఈ సందర్భంగా అడిషనల్‌ సీఈఓ మరియు డైరెక్టర్‌ ఆఫ్‌ -టె-జరీస్‌ సానుకూలంగా స్పందించారని తెలిపారు. సీఎఫ్‌ఎంఎస్‌ తరపున చేయవలసిన మార్పు చేర్పులపై వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని జానీ పాషా తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement