Thursday, December 5, 2024

AP | అప్పటి వరకు రాంగోపాల్‌ వర్మను అరెస్ట్ చేయొద్దు.. హైకోర్టు

ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్‌లో పోస్ట్ చేసిన అంశంలో టాలీవుడ్‌ డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పీఎస్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ.. విచారణకు హాజరుకాని వర్మ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కూడా దాఖలు చేశాడని తెలిసిందే.

తాజా ఈ కేసులో రాంగోపాల్‌ వర్మకు ఏపీలో హైకోర్టులో ఊరట లభించింది. ఇటీవల ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఆర్జీవీ దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం (ఈ నెల 9)వరకు వరకు అరెస్ట్‌ చేయొద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. కోర్టు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

తనపై రాజ్యాంగ విరుద్ధంగా కేసు పెడుతున్నారని ఆర్జీవీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తాను కామెంట్‌ చేసిన వ్యక్తులు కాకుండా.. సంబంధం లేని వ్యక్తులు తనపై కేసులు పెట్టారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తనపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయకుండా ఆదేశాలు జారీచేయాలని కోర్టుకు నివేదించాడు వర్మ.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement