అమరావతి,ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్శిటీల ప్రమాణాలు పూర్తిగా పడిపోతున్నాయి. నానాటికి తీసికట్టుగా తయారవుతున్నాయి. దేశవ్యాప్తంగా అత్యుత్తమ విద్యాసంస్థలకు కిచ్చే ర్యాంకులను ఇటీవల ప్రకటించిగా అందులో మన రాష్ట్ర యూనివర్శిటీ పరిస్థతి దారుణంగా ఉంది. దేశవ్యాప్తంగా మొదటి వంద అత్యుత్తమ విద్యా సం స్థల్లో ఒక్క ఆంధ్రా యూనివర్శిటీకి మాత్రమే చోటు దక్కింది. అది కూడా 2019లో 29 ర్యాంకింగ్ ఉన్న ఆంధ్రా వర్శిటీ ప్రస్తుతం 76వ స్థానానికి దిగజారింది. ఇక మొదటి అత్యుత్తమ వంద యూనివర్శిటీలలో ఆంధ్రా వర్శిటీతోపాటు వెంకటేశ్వర యూనివర్శిటీకి మాత్రమే చోటు లభించింది.
రాష్ట్ర మొత్తంలో దాదాపు 23 రాష్ట్ర ప్రభుత్వ యూనివర్శిటీలు ఉన్నప్పటికీ కేవలం రెండు యూనివరి ్శటీలు మాత్రమే టాప్ 100 లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాయి. అందులోనూ ఆంధ్ర వరి ్శటీ పరిస్థితి క్షీణిస్తూనే ఉంది. 19వ స్థానం నుండి 43వ స్థానానికి పడిపోయింది. యూనివర్శిటీల జాబితాలో వెంకటేశ్వర యూనిర్శిటీ మూడు ర్యాంకులు మెరుగైనప్పటికీ టాప్ 100 విద్యా సంస్థల్లో మాత్రం చోటు లభించ లేదు. అదే 2021లో మాత్రం 92 వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది మాత్రం ర్యాంక్ దిగజారింది. ఇక మిగిలిన యూనివర్శిటీ పరిస్థితి సరేసరి. ఎక్కడా పోటీలో కూడా లేవు.
దారితప్పిన అకడమిక్ గవర్నెన్స్
రాష్ట్ర యూనివర్శిటీల్లో ప్రమాణాలు తగ్గడానికి ప్రధాన కారణం అకడమిక్ గ వర్నెన్స్ దారితప్పడమేనని నిపుణులు అంటున్నారు. చాలా యూనివర్శిటీల్లో క్లాసులే సరిగ్గా జరగని వైనం కనిపిస్తోంది. క్లాసులు సక్రమంగా జరిపించాల్సిన వైఎస్ ఛాన్సలర్లు చేతగాని వ్యక్తుల్లాగా చేష్టలుడిగి కూర్చుకున్నారు. క్లాసులు నిర్వహించని ప్రొఫెసర్లను మందలించి వారి చేత పని చేయించే పరిస్థితి లేదు. దీనికి కారణంగా అకడమిక్ నేపథ్యం ఉన్న వారిని కూడా రాజకీయ ప్రాధాన్యతలతో వైఎస్ ఛాన్సలర్‌ను నియమించడమే కారణం. యూనివర్శిటీల్లో రిజిష్ట్రార్‌గా, రెక్టర్‌గా, హాస్టల్ వార్డెన్, యుజిసి, నాక్ కోఆర్డినేటర్లుగా, డిపార్టెట్మెంట్ డీన్లుగా, ఇలా వివిధ రకాల పోస్టుల్లో కనీసం మూడింటిలోనైనా పని చేసిన వారిని వైఎస్ ఛాన్సలర్లుగా నియమిస్తే వారికి అప్పటికే ఉన్న అనుభవంతో వర్శిటీని సమర్దవంతంగా నడపగలుగుతారు.
కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేక రాజకీయ ప్రాధన్యమున్న వారిని, కేవలం ప్రొఫెసర్‌గా పనిచేసిన వారినే నేరుగా తీసుకొచ్చి విసిలుగా నియమించడంతో వారు అన్నీ అర్దం చేసుకొని వర్శిటీని సమర్ధవంతంగా నడిపే సమయానికి పుణ్యకాలం కాస్త పూర్తయిపోతోంది. ప్రమాణాలు పెరగాలన్నా, ర్యాంకింగ్ మెరుగుపడాలన్నా పరిశోదన పని ఎక్కువగా జరగాలి. క్లాసులే సరిగ్గా జరగకపోతుంటూ పరిశోధన ఎక్కడ జరగుతుందనేది సమస్య. పరిశోధనా ప్రాజెక్టులను ప్రొఫెసర్లు వ్యక్తిగతంతా తెచ్చుకోవచ్చు, లేదా డిపార్టెంట్ ద్వారానైనా తెచ్చుకోవచ్చు. అయితే ప్రస్తుతం రాష్ట్ర యూనివర్శిటీల్లోని డిపార్టెమెంట్లు చురుకైన పాత్ర పోషించి పరిశోధనా ప్రాజెక్టులు తెచ్చుకోవడంలో వెనుకపడిపోతున్నాయి.
ఒక వేళ ప్రాజెక్ట్ వచ్చినా ఆ నిధులను ఉపయోగించుకోవడంలోనూ ఆలసత్వం ప్రదర్శిస్తున్నారు. వెంకటేశ్వర వర్శిటీలో ఒక ప్రాజెక్ట్‌కు ఐదు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు రాగా వాటిని సద్వినియోగం చేసుకున్న పరిస్థితి లేదు. ఇటువంటి లోపాలన్నింటినీ సరిచేసుందుకు మూడునెలల ఒక మారు జరిగే వరి ్శటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ప్రతి డిపార్టెమెంట్ మీద సమీక్ష చేసి వాటి పనితీరును అంచనా వేసి నివేదికలు రూపొందించాల్సి ఉంటుంది. ఆ అధ్యయన కమిటీలను కూడా వర్శిటీ నుండే కాకుండా ఐఐటి, కేంద్రీయ విద్యా సం స ్థలు, ఇతర ప్రముఖ విద్యా సం స్థల ప్రతినిధులతో నియమించి నివేదికలు తయారు చేయించి వాటిని అమలు చేస్తే ఫలితాలు మెరుగ్గా వస్తాయి.
కానీ ఈ పని జరగడం లేదు. పేరుకు స్టేట్ రీసెర్చ్ బోర్డు పెట్టినప్పటికీ దాని వల్ల ఎటువంటి ఫలితం లేకపోయింది. సిలబస్‌ను మార్చడం, పరిశోధనా ప్రమాణాలను పెంచడం లాంటి పనులను స్టేట్ రీసెర్చ్ బోర్డు చేయలేపోతోంది. అధ్యాపక పోస్టుల కొరత కొంతమేరకు ఉన్నా ఉన్న అధ్యాపకులు చురుగ్గా పనిచేసినా ప్రమాణాలు పెరుగుతాయి. కానీ ఆ పని విసీలు చేయలేపోతున్నారు. మొత్తంగా అకడమిక్ గవర్నెన్స్ దారి తప్పడంతో ర్యాంకులు కూడా రావడం లేదు.