ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తండ్రి భూపతి రాజు సూర్యనారాయణ రాజు అనారోగ్యంతో చికిత్స పొందుతూ హైదారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గురువారం సాయంత్రం మృతి చెందారు.
ఆయన వయసు 91 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భూపతి రాజు సాంఘిక సంక్షేమ శాఖలో జిల్లా అధికారిగా పని చేసి పదవీ విరమణ చేశారు. వీరి తండ్రి భూపతిరాజు బాపిరాజు స్వాతంత్య్ర ఉద్యమంలో జైలు జీవితం గడిపారు.
భూపతిరాజు సూర్యనారాయణ రాజు భౌతిక కాయం శుక్రవారం ఉదయం భీమవరంలో వారి స్వగృహం నందు దర్శనార్థం ఉంచి, మధ్యాహ్నం ఒంటిగంటకు అంత్రిమ యాత్రగా భీమవరం టూ టౌన్లో బలుసుమూడి మోక్షధానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు మంత్రి కార్యాలయ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలియజేశారు.