Monday, December 9, 2024

AP | కనకదుర్గమ్మ సన్నిధిలో కేంద్ర మంత్రి సురేష్ గోపి..

(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో ) : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధికి ప్రముఖ సినీనటుడు కేంద్ర మంత్రి సురేష్ గోపి విచ్చేశారు. శుక్రవారం శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి ఆలయమునకు విచ్చేశారు.

ఈసంద‌ర్భంగా ఆలయ సూప‌రింటెండెంట్ గురురాజు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సురేష్ గోపికి ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదములు, చిత్రపటం అందజేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement