ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎన్డీయే కూటమిలో చేరాలని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే అన్నారు. ఆదివారం విశాఖలో పర్యటించిన ఆయన.. కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ తనకు మంచి మిత్రుడు అని, వైసీపీ కేంద్రంలోని ఎన్డీయేలో చేరాలన్నారు. కేంద్రం భాగస్వామ్యంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. రోడ్లు, నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా ఏపీకి మేలు జరుగుతుందని చెప్పారు. మూడు రాజధానుల అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని, కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణతో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు విఘాతం కలుగుతుందని అన్నారు. అయితే, ఎస్టీ, ఎస్టీ రిజర్వేషన్లకు నష్టం వాటిళ్లకుండా కేంద్రం చర్యలు తీసుకుంటోందని రాందాస్ అథవాలే స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు కేసీఆర్ దిశా నిర్ధేశం