Friday, November 22, 2024

శ్రీకాంత్ రెడ్డి హత్యకు కుట్ర: ఆత్మకూరు ఘటనపై కేంద్ర మంత్రి వ్యాఖ్య

కర్నూలు జిల్లా ఆత్మకూరు ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం దాడి చేసిన నిందితులను సిఎం జగన్ కాపాడే ప్రయత్నం చేశారన్నారని కేంద్రమంత్రి మురళీధరన్ ఆరోపించారు. కర్నూలు జిల్లాకు చెందిన బీజేపీ జిల్లా అధ్యక్షుడి శ్రీకాంతరెడ్డిని పరామర్శించేందుకు తాను వచ్చానని కేంద్రమంత్రి మురళీధరన్ పేర్కొన్నారు. ఆత్మకూరుకు వెళ్లిన శ్రీకాంత్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. అక్రమ కట్టడాలు నిర్మాణం జరుగుతున్నాయని బుడ్డా శ్రీకాంత్ రెడ్డి అక్కడికి వెళ్ళారన్నారు. పోలీసుల అనుమతి కూడా తీసుకున్నారన్నారు. శ్రీకాంత్ రెడ్డిని చంపాలని కొంత మంది దుష్ట శక్తులు ప్రయత్నం చేసి దాడి చేశారన్నారు.

రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం రాజ్యమేలుతోందని ఆరోపించారు. ఏపీలో టెర్రరిస్ట్ యాక్టివిటీ పెరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదుల సంస్థల చెందిన కొంత మంది ఉన్నారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. పోలీసులు వైసీపీ నాయకుల కనుసన్నల్లో పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆత్మకూరులో పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన వారిని వదిలేసి, బుడ్డా శ్రీకాంత్ రెడ్డిపై కేసులు పెట్టారన్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడటం తగదన్నారు. శ్రీకాంత్ రెడ్డిపై కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్లాన్ ప్రకారం శ్రీకాంత్ రెడ్డిని హత్య చేయాలని చూశారని ఆరోపించారు. బీజేపీ శ్రేణులను ఆత్మకూరు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నాని మండిపడ్డారు. బీజేపీ శ్రేణులను ఆత్మకూరుకు వెళ్లేలా అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే రానున్న కాలంలో ఉద్యమాలు తప్పవని కేంద్రమంత్రి మురళీధరన్ హెచ్చరించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement