Saturday, November 23, 2024

Delhi: విజయవాడ ఫ్లైఓవర్ల నిర్మాణంపై గడ్కరీ సానుకూలం.. సమగ్ర ప్రాజెక్టు రూపకల్పనకు బిడ్లు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్ (నాని) ప్రతిపాదించిన మూడు ఫ్లైఓవర్లపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ఈ ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)లు సిద్ధమయ్యాక తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. విజయవాడ మహానాడు జంక్షన్ నుంచి నిడమానూరు జంక్షన్ వరకు ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని సుమారు 6.5 కి.మీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్.హెచ్.ఏ.ఐ) ప్రతిపాదించగా, అందుకు బదులుగా మహానాడు జంక్షన్, రామవరప్పాడు జంక్షన్, ఎనికెపాడు జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టాల్సిందిగా ఎంపీ కేశినేని నాని ప్రతిపాదించారు.

ఈ మేరకు కేశినేని రాసిన లేఖపై కేంద్ర మంత్రి స్పందిస్తూ.. ఈ ప్రతిపాదనలు తమ శాఖ పరిశీలిస్తోందని వెల్లడించారు. ఇందులో భాగంగా ఎన్.హెచ్.ఏ.ఐ ఇప్పటికే ఈ ఫ్లైఓవర్ల నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు కోరుతూ బిడ్లను ఆహ్వానించిందని తెలిపారు. డీపీఆర్‌లు రూపొందిన తర్వాత తగు నిర్ణయం తీసుకుంటామని గడ్కరీ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement