కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఇవ్వాల (బుధవారం) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు సంప్రదాయబద్ధంగా ఆయనకు స్వాగతంపలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ఈ సందర్భంగా గజేంద్ర సింగ్ షెకావత్‌కు శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, డైరీ, క్యాలెండర్ అందజేశారు. కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబు, ఎంపీలు మిథున్ రెడ్డి, రెడ్డెప్ప, టీటీడీ బోర్డు మాజీ మెంబర్ భానుప్రకాష్‌రెడ్డి ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement