తాడికొండ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని టీడీపీ అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆమె బాపట్ల ఎంపీ టికెట్ ఆశించినా దక్కలేదు. ఇటీవల టీడీపీలో చేరిన చిలకలూరిపేట వైసీపీ నేత మల్లెల రాజేశ్‌నాయుడును రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్టు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
ఉండవల్లి శ్రీదేవి గుంటూరు జిల్లా, తాడికొండలో 1969లో జన్మించింది. ఆమె 1993లో బెంగళూరులో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఆమె తండ్రి ఉండవల్లి సుబ్బారావు 1978లో తాడికొండ నుంచి రెడ్డి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ గెలుపొందాడు. తల్లి వరలక్ష్మి ఉపాధ్యాయురాలు. శ్రీదేవి 2017లో వైసీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి, తాడికొండ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్తగా పని చేసి, నియోజకవర్గంలో వైద్య శిబిరాలు, రాజన్న క్యాంటీన్ లాంటి కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యారు.