Saturday, November 23, 2024

పెంచిన జీతాలు వద్దా?: ఈ పరిస్థితి ఎప్పుడూ చూడలేదు: ఉండవల్లి

పీఆర్సీపై ప్రభుత్వ ఉద్యోగులు వ్యవహరిస్తున్న తీరును మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తప్పుబట్టారు. కొత్త పీఆర్సీ అమలు చేయటం వల్ల రూ. 10,247 కోట్లు అదనపు భారం పడుతుందని ప్రభుత్వం చెబుతుంటే.. పెంచిన జీతాలు వద్దు పాత జీతాలే చాలు అంటూ ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగిన పరిస్థితి ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఎక్కడైనా ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాలు పెంచాలంటూ సమ్మెలు చేయటం చూశామని, కానీ పెంచిన జీతాలు వద్దు.. పాత జీతాలే ముద్దు అంటూ సమ్మె నోటీసు ఇవ్వడం బహుశా ఇదే ప్రధమం అని చెప్పారు. కరోనా కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితి దారుణంగా ఉంది. ఇవన్ని ప్రభుత్వ ఉద్యోగులు దృష్టిలో పెట్టుకుని సమ్మెను ఆపవల్సిందిగా ప్రార్థిస్తున్నానని అన్నారు. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు పట్టింపులకు పోకుండా చర్చలు ద్వారా సమస్యకు పరిష్కరం సాధించాలని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement