ఉత్తరాఖండ్ ఎన్నికల ర్యాలీలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్. ఈ మేరకు ట్విట్టర్లో రాహుల్కు మద్దతుగా నిలిచారు. వివాదాస్పద అంశాలపై రాజకీయ చర్చ చాలా కీలకమైనప్పటికీ వాడే భాష, చేసే ప్రకటనలు ఎప్పుడూ మర్యాద, హద్దులు దాటకూడదని ఎమ్మెల్సీ నారా లోకేశ్ ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలు బాగాలేవని ఆయన అన్నారు.
అంతేకాకుండా, గత ఏడాది నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తన తల్లిని ‘దూషణ చేశారని, ఆ అనుభవంతో చెబుతున్నా.. ఆ మాటలు ఎంత బాధాకరమో అని పోల్చారు నారా లోకేశ్. మహిళలను లక్ష్యంగా చేసుకుని మాటలనడం ఎవరికీ ఆమోదయోగ్యం కాదు” అని ట్విట్టర్లో పేర్కొన్నాడు. అయితే.. రాహుల్ గాంధీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమారుడని రుజువు చేయాలని బీజేపీఎప్పుడైనా డిమాండ్ చేసిందా అని అస్సాం ముఖ్యమంత్రి ప్రశ్నించడమే దీనికి కారణంగా తెలుస్తోంది.