Saturday, November 23, 2024

25 నుంచి ఉజ్వల్‌ భారత్‌, ఉజ్వల్‌ భవిష్య వేడుకలు : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..

అమరావతి, ఆంధ్రప్రభ : దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రప్రభుత్వం నిర్వహిస్తున్న అజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఉజ్వల్‌ భారత్‌, ఉజ్వల్‌ భవిష్య, పవర్‌ – 2047 పేరుతో ఈ నెల 25 నుంచి 30 వరకు ఉత్సవాలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి రాజ్‌కుమార్‌ సింగ్‌ గురువారం అన్ని రాష్ట్రాల విద్యుత్‌ శాఖ మంత్రులతో వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. తన క్యాంప్‌ కార్యాలయం నుంచి రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా వారం రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు విద్యుత్‌ రంగంలో దేశం సాధించిన ప్రగతి, రానున్న రోజుల్లో సాధించాల్సిన లక్ష్యాలు, 2047 నాటికి విద్యుత్‌ రంగంలో దేశం సరికొత్తగా సాధించబోయే అభివృద్ధిని ప్రజల ముందు ఉంచాలని కేంద్ర మంత్రి నిర్ధేశించారు. మొత్తం ఆరు కార్యక్రమాల ద్వారా ఈ అంశాలను ప్రజలకు వివరించాలని కోరారు. దీనిపై ఆయా రాష్ట్రాలకు చెందిన మంత్రులతో కేంద్ర మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement