శ్రీశైలం – ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహా క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి ఉగాది మహోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు ఆదివారం నాడు భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రానికి చేరుకున్నారు. భక్తులందరు సంతృప్తికరంగా శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు వీలుగా దర్శన ఏర్పాట్లు చేశారు..
తెల్లవారుజామున ఆలయద్వారాలు తెరచి. ప్రాతఃకాల పూజల అనంతరం. వేకువజామున గం.3.00నుండి
సాయంకాలం గం. 4.00ల వరకు దర్శనాలు కల్పిస్తున్నారు..
అదేవిధంగా తిరిగి సాయంత్రం గం. 5.30ల నుంచి అర్థరాత్రి గం. 12.00ల వరకు కూడా దర్శనాలు కొనసాగుతాయి.
మొత్తం మూడు క్యూలైన్ల ద్వారా భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నారు..
ఉచిత దర్శనం, శీఘ్రదర్శనం ( రూ.200/-), అతిశీఘ్రదర్శనం ( రూ.500/-)
అదేవిధంగా శ్రీవృద్ధమల్లికార్జునస్వామివార్లకు అభిషేకం, శ్రీస్వామి అమ్మవార్ల కల్యాణం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం మొదలైన ఆర్జితసేవాకర్తలకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేశారు
భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ఉత్సవాలలో స్వామివారి స్ప ర్శదర్శనం పూర్తిగా నిలిపివేశారు.
భక్తులందరికీ కూడా స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు.. అదేవిధంగా గర్భాలయ, సామూహిక అభిషేకాలు పూర్తిగా నిలిపివేశారు.. ఆర్జితఅభిషేకాలు వృద్ధమల్లికార్జునస్వామివారి ఆలయంలో జరుగుతున్నాయి.
ఆర్జిత అభిషేక సేవాకర్తలకు కూడా స్వామివార్ల అలంకార దర్శనం మాత్రమే కల్పించబడుతోంది.
సిబ్బందికి ప్రత్యేక విధులు
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆయా సదుపాయాలను కల్పించేందుకై దేవస్థానం. పర్యవేక్షకులకు, ఇతర సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు. దాదాపుగా కార్యాలయం సిబ్బంది అంతా కూడా ప్రత్యేక విధులను నిర్వర్తిస్తున్నారు.
క్యూలైన్లలో అల్పాహారం.
ఉగాది ఉత్సవాలలో క్యూకాంప్లెక్స్ లో వేచివుండే భక్తులకు నిరంతరం అల్పాహారం, బిస్కెట్లు మరియు మంచినీరు, మజ్జిగ అందజేస్తున్నారు. అదేవిధంగా ఉదయం వేళలలో పాలు కూడా ఇస్తున్నారు
లడ్డు ప్రసాదాలు…
ఉగాది ఉత్సవాలలో వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన సంఖ్యలో లడ్డు ప్రసాదాలు సిద్ధం చేశారు. మొత్తం 15కౌంటర్ల ద్వారా లడ్డు ప్రసాదాలు. విక్రయిస్తున్నారు.