Monday, November 25, 2024

ప్రతిభామూర్తులకు ఉగాది పురస్కారాలు.. గ్రహీతలు ఎవరంటే..

అమరావతి, ఆంధ్రప్రభ: తెలుగు సంస్కృత అకాడమీ ఆధ్వర్యంలో శుభకృత్‌ నామ ఉగాది వేడుకలు నిర్వహించనున్నట్లు- అకాడమి ఛైర్‌పర్సన్‌ డా. నందమూరి లక్ష్మీపార్వతి తెలిపారు. బుధవారం ఒక ప్రకటనలో విజయవాడలోని కేబీఎన్‌ కళాశాలలో ఏప్రిల్‌ 2వ తేదీన వేడుకలు జరుగుతాయన్నారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ ఉగాది పంచాంగ పఠనం చేస్తారన్నారు. విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్‌, దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్థన్‌, ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జె. శ్యామలరావు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొ. కె. హేమచంద్రారెడ్డి, కాలేజియేట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ పోలా భాస్కర్‌, గిరిజన సంక్షేమశాఖ సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు, ‘అకాడమి’ డైరెక్టర్‌ వి. రామకృష్ణ, డిప్యూటీ- డైరెక్టర్‌ డా. సీహెచ్‌ సుశీలమ్మ అతిథులుగా హాజరవుతున్నట్లు చెప్పారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులకు అకాడమి పక్షాన ఉగాది పురస్కారాలు అందజేస్తామన్నారు.

ఉగాది పురస్కార గ్రహీతలు వీరే..

  1. ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి(ప్రాచీన సాహిత్యం)
  2. డాక్టర్‌ శాంతి నారాయణ(కథా సాహిత్యం)
  3. ‘రంగం’ రాజేష్‌(జానపదం)
  4. కోకా విజయలక్ష్మి(కూచిపూడినృత్యం)
  5. నల్లి ధర్మారావు(పత్రికారంగం)
  6. సంజయ్‌ కిశోర్‌(కళాసేవ)
  7. శంకర నారాయణ(హాస్యావధానం)
Advertisement

తాజా వార్తలు

Advertisement