నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా మిచాంగ్ తుఫాను కదులుతోంది. దీంతో ఏపీకి మిచాంగ్ తుఫాన్ ముప్పు పొంచివుంది. గంటకు 13 కిలో మీటర్ల వేగంతో తుఫాన్ కదులుతోంది. ప్రస్తుతానికి చెన్నైకి 150 కిలోమీటర్లు, నెల్లూరుకు 250 కిలో మీటర్లు, బాపట్లకు 360 కిలో మీటర్లు, మచిలీపట్నానికి 380కిలో మీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైంది.
ఇవాళ కోస్తా తీరానికి సమాంతరంగా పయనించనుంది. రేపు (మంగళవారం) మధ్యాహ్నం నెల్లూరు – మచిలీపట్నం మధ్య మిచాంగ్ తీవ్ర తుఫానుగా తీరం దాటనుంది. దీని ప్రభావంతో నేడు (సోమవారం), రేపు (మంగళవారం) కూడా కోస్తాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అతి తీవ్ర భారీ వర్షాలు కురువనున్నాయి.