Friday, November 22, 2024

AP | తుపాన్‌ బీభత్సం.. 65 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు..

కేవీబీపురం, (తిరుపతి) ప్రభ న్యూస్‌ : తుపాన్‌ కారణంగా తిరుపతి జిల్లా కేవీబీ పురం మండలంలో కురిసిన వర్షాలకు వాగులు,, వంకలు,, చెరువులు పొంగి పొర్లడంతో ఎక్కడికక్కడ రాకపోకలు స్థంభించాయి. తుపాన్‌ ప్రభావం ప్రారంభం కాకముందు నుంచే తహసిీల్దార్‌ శ్రీదేవి, ఎంపీడీవో రామచంద్ర ఆధ్వర్యంలో అధికారులు సమస్యాత్మక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. కోవనూరు బై రాజుల కండ్రిగ ప్రధాన రోడ్డు మార్గంపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.

అలాగే అంజూరు చెరువు పూర్తిస్థాయిలో నిండిపోవడంతో అధికారులు జేసిబి సహాయంతో వరద నీటిని తెలుగు గంగలోకి మళ్ళించారు. రాజులరాజుల కండ్రిక పులిసికేపురం కాజ్వే వద్ద ప్రమాద హెచ్చరికలను అధికారులు జారీ చేశారు. మండలంలోని కాళంకి నదికి ఐదువేల క్యూసెక్కుల వరద నీరు ఉదృతంగా వస్తుండడంతో ఆరు చిన్న గేట్లను ఐదు అడుగుల ఎత్తు మేరా ఎత్తి 4వేల క్యూసెక్కుల వరద నీరును అధికారులు బయటికి పంపుతున్నారు. కాళంగి పూర్తి నీటిమట్టం 222 అడుగులకు కాను 218 అడుగుల వరద నీరు నదిలోకి వచ్చిందని నీటిపారుదల శాఖ అధికారి సురేష్‌ తెలిపారు.

మండలంలోని వగత్తూరు పంచాయతీ వగత్తూరు ఎస్టీ కాలనీ, కోటమంగాపురం, జయలక్ష్మీ పురం, కొట్టాల మిట్ట ఎస్టీ కాలనీ, తదితర సమస్తాత్మక గ్రామాలలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు- చేసినట్లు- తహసిల్దార్‌ శ్రీదేవి తెలిపారు. అలాగే మండలంలో ఇప్పటివరకు 65 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.మండల ప్రజలకు ఎటు-వంటి ఇబ్బందులు ఎదురైన వెంటనే వారి వారి గ్రామాలలోని అధికారులకు తెలియజేయడంతో పాటు- 9491077048, 9491071355 ఈ ఫోన్‌ నెంబర్లకు సంప్రదించాలని ఆమె మండల ప్రజలను కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement