Saturday, September 7, 2024

వినాయక నిమజ్జనంలో అపశృతి – ఇద్దరు యువకులు దుర్మరణం

కర్నూలు జిల్లాకర్నూలు జిల్లా పరిధిలో పలుచోట్ల నిర్వహించిన వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. దీంతో పండగ పూట ఆనందాలు నిడాల్సిన వేళా ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది. అప్పటి వరకు ఎంతో సంతోషంగా పండగ సంబరాలు చేసుకున్న ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు మరణించారు. వివరాలలోకి వెళ్తే.. కృష్ణగిరి మండలం కోయిలకొండలో వినాయక చవితిని ఎంతో కోలాహలంగా జరుపుకున్నారు. గణేష్ ని నిమజ్జనం చేసేముందు ఆనవాయితి ప్రకారం ఊరేగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఊరేగింపు ముందు ఎంతో సంతోషంగా డ్యాన్స్ వేస్తున్న మురళీకృష్ణ అనే యువకుడు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. దీనితో అతన్ని హాస్పిటల్ కి తరలించగా అతను మార్గం మధ్యలోనే గుండెపోటుతో మరణించాడని వైద్యులు తెలిపారు.

ఇక కర్నూలు జిల్లాలోనే మరో దుర్ఘటన చోటు చేసుకుంది. వెల్దుర్తి మండలం కృష్ణాపురంలో వినాక చవితిని ముగించుకుని పండగలో భాగంగా వినాయకుణ్ణి నిమజ్జనం చేయడానికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో వినాయకుణ్ణి నీటిలో నిమర్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తు రాజు అనే యువకుడు వినాయకుడితో పాటు నీళ్లలోకి జారిపడి మృతి చెందాడు. వేర్వేరు ఘటనలో యువకులు మరణించడం అందరిని కలిచి వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement