కృష్ణా జిల్లా మచిలీపట్నం లోని అమృతపురంకు చెందిన ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. అవనిగడ్డ డి.ఎస్.పి మెహబూబ్ బాషా దత్తత తీసుకున్న ఈ కాలనీలోని ఇద్దరు బాలికలు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. కాలనీలోని పెద్ద (ప్రెసిడెంట్) ముత్తెశ్వరరావు ఇచ్చిన వివరాల మేరకు ఈ కాలనీలో ఇద్దరు బాలికలు కనిపించకుండా పోవడం వాస్తవమేనని తెలిపారు. మాకున్న సమాచారం మేరకు, మా కుల పెద్దలకు తెలిసిన సమాచారం వరకు గత రెండురోజుల క్రితం ఒక మైనర్ బాలికకు గుట్టుచప్పుడు కాకుండా వారి తల్లే పెళ్లి చేసినది అని, అదికూడా నాగాయలంక లో జరిపించినది స్థానికులు చెప్పుకొనుచున్నారు అని చెప్పడం గమనార్హం.
డి.ఎస్.పి మెహబూబ్ బాషా మచిలీపట్నంలో ఉన్నప్పుడు తరచూ మా కాలనీకి వచ్చి ఇక్కడి పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసి బాల్యవివాహల వల్ల జరిగే నష్టాన్ని వివరించి అందర్నీ చైతన్య పరిచే వారని, వారు ఇక్కడినుండి అవనిగడ్డ బదిలీపై వెళ్లినప్పటినుండి ఈ కాలనిలో చాలా మంది పిల్లలకు మైనర్ వివాహాలు జరిపిస్తున్నా అధికారులు చుసిచుడనట్లు వ్యవహరిస్తున్నారని వాపోయారు. మంచి సేవా గుణం కలిగిన వ్యక్తిని ఈ కాలనీ ప్రజలు కోల్పోవడం దురదృష్టమని అన్నారు. అధికారులు చొరవతీసుకుని మైనర్ బాలికలు కనిపించకుండా పోవడం పట్ల చర్యలు చేపట్టి కుటుంబీకులకు అప్పగించాలని కోరుతున్నారు. మరోవైపు కనిపించకుండా పోయిన మైనర్ బాలికల తల్లి పిర్యాదు మేరకు మిస్సింగ్, కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని స్థానిక పోలీసులు తెలిపారు.