తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట ఉండూరు బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెట్రోలింగ్ వెహికల్ తో ఉన్న ఇద్దరు పోలీసులపై లారీ దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు పోలీసులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతులను తిమ్మాపురం పోలీసు స్టేషన్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ మెండి సత్యనారాయణ, హోం గార్డు ఎన్ఎస్ రెడ్డిగా గుర్తించారు. విజయవాడ నుంచి వచ్చే కోవిడ్ వ్యాక్సిన్ వాహనానికి ఎస్కార్ట్ విధుల కోసం ఉండూరు వంతెన వద్ద వేచి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement