ఏపీలో నూతన రహదారుల నిర్మాణం, విస్తరణ పనుల్లో వేగం పెరిగింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నో రోజులుగా స్తబ్ధుగా ఉన్న ప్రాజెక్టులకు సైతం మోక్షం కలుగుతోంది. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాలో రెండు కీలక ప్రాజెక్టులు చేపడుతున్నారు. వాడరేవు – పిడుగురాళ్ల జాతీయ రహదారి, కొండమోడు- పేరేచెర్ల నాలుగు లేన్ల జాతీయ రహదారి విస్తరణ పనులను చేపడుతున్నారు.
ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే గుంటూరు జిల్లాలో మౌలిక వసతులు మరింత మెరుగుపడతాయని అధికారులు భావిస్తున్నారు. కాగా, కొండమోడు – పేరెరా జాతీయ రహదారి పనులకు రూ. 881 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అలాగే వాడరేవు-పిడుగురాళ్ల నాలుగు లైన్ల రోడ్డు పనులకు రూ. 1,064.24 కోట్లు వెచ్చించనున్నారు.