Tuesday, November 19, 2024

ప్రకాశం బ్యారేజీ దిగువన మరో రెండు కొత్త బ్యారేజీలు.. ప్రతిపాదించిన ఏపీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన కొత్తగా మరో రెండు బ్యారేజీలు నిర్మించాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ నిర్ణయం నీటి ఒప్పందాలను, నిబంధనలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. ఈ విషయమై కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ మంగళవారం ప్రత్యేకంగా లేఖ రాశారు. కృష్ణా బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా ప్రాజెక్టులు నిర్మించరాదన్న నిబంధనలను ఏపీ ఖాతరు చేయడం లేదని మండిపడ్డారు.

ఏపీ ప్రభుత్వం తరచూ జల ఒప్పందాలను, నిబంధనలను బేఖాతరు చేస్తోందని ఇదివరకే తాము ఫిర్యాదు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏపీ తీరుపై తాము ఎప్పటి నుంచో వ్యక్తం చేస్తున్న ఆందోళనలకు నిదర్శనమే తాజాగా ప్రకాశం బ్యారేజీ దిగువన ప్రతిపాదించిన మరో రెండు కొత్త బ్యారేజీల నిర్మాణామని ఈఎన్‌సీ మురళీధర్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆ రెండు కొత్త బ్యారేజీల పనులు చేపట్టకుండా ఏపీని కట్టడి చేయాలని లేఖలో కేఆర్‌ఎంబీని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement