ఏపీలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి… తీవ్రవాయుగుండంగా బలపడనుంది. దీని ప్రభావంతో వచ్చే రెండు రోజులు కొన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. అందులో భాగంగా రేపు (సోమవారం) శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి జిల్లాల్లోని విద్యాసంస్థలకు రేపు సెలవు ప్రకటించారు.
పలు జిల్లాలకు రెడ్ అలర్ట్!
మరోవైపు వాయుగుండం కారణంగా సోమవారం ఏలూరు, అల్లూరి, ఉభయగోదావరి, ఎన్టీఆర్ జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ క్రమంలోనే అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు రెడ్ అలర్ట్.. శ్రీకాకుళం, మన్యం జిల్లా, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాలకు వాతావరణశాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది.