Monday, November 25, 2024

ఏపీకి 2 లక్షల డోసుల కోవాగ్జిన్ టీకాలు..

ఏపీలో కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ కార్యక్రమాం మళ్లీ ఊపందుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అమలు చేయాలనుకుంటున్నప్పటికీ… టీకాల కొరత అడ్డంకిగా మారింది. దీంతో వ్యాక్సిన్లు పంపాలంటూ ముఖ్యమంత్రి జగన్ కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు కూడా రాశారు. తాజాగా హైదరాబాద్ నుంచి విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్ట్ కు 2 లక్షల కోవాగ్జిన్ టీకాలు చేరుకున్నాయి. వీటిని గన్నవరంలోని వ్యాక్సిన్ నిల్వ కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి వివిధ జిల్లాలకు పంపిణీ చేయనున్నారు. మరోవైపు, వ్యాక్సిన్ ను ఫార్మా కంపెనీల నుంచి నేరుగా కొనుగోలు చేసేందుకు రాష్ట్రాలకు కేంద్రం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆ దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement