తిరుపతి : శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ నిర్మాణంలో అపశృతి చోటచేసుకుంది. ఫ్లె ఓవర్ కు గడ్డర్ ను అమర్చే సమయంలో ప్రమాదం జరిగి ఆప్కాన్స్ సంస్థకు చెందిన కార్మికులు ఇద్దరు మృతి చెందారు.జెసిబిలతో విరిగిన గడ్డర్ ను తీసే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు
ఘటనా స్థలికి ఈస్ట్ సిఐ మహేశ్వర్ రెడ్డి. చేరుకుని సహాయక కార్యక్రమాలు ముమ్మరం చేసారు. మృతుల్లో వెస్ట్ బెంగాల్ కు చెందిన అవిజిత్, మరొకరు బీహార్ కు చెందిన బార్థోమాండల్ ఉన్నారు.