Saturday, December 21, 2024

AP | యువతకు ఉపాధే లక్ష్యం.. రెండు ప్రధాన సంస్థలతో కీలక ఒప్పందాలు !

ఏపీలో మరో ప్రతిష్టాత్మక ఇన్నోవేషన్ యూనివర్శిటీ ఏర్పాటు కానుంది. అధునాతన సాంకేతిక ఆవిష్కరణలకు కేంద్రంగా వెలుగొందుతున్న ఆంధ్రప్రదేశ్‌లో డీప్‌టెక్ ను అభివృద్ధి చేయ‌డంలో భాగంగా ఏపీ ప్రభుత్వం రెండు ప్రధాన కంపెనీలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ మేర‌కు

ఫిజిక్స్ వాలా (PW) ఎడ్యుటెక్ కంపెనీ తన పరిశ్రమ భాగస్వామి అమెజాన్ వెబ్‌తో కలిసి AI- ఫోకస్డ్ ఫస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ (IoE) యూనివర్శిటీ ఆఫ్ ఇన్నోవేషన్ (UoI) ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఏపీలో ఉన్నత విద్యను ఆధునీకరించేందుకు టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ (TBI)తో మరో ఒప్పందం కుదిరింది.

ఈ మేర‌కు ఉండవల్లి నివాసంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఏపీ ప్రభుత్వంతో ఫిజిక్స్ వాలా, టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు వేర్వేరుగా ఎంఓయూపై సంతకాలు చేశారు. రాష్ట్ర యువతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో నెం.1గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు బాబు ఆలోచనలకు అనుగుణంగా ఈ ఒప్పందాలు జరిగాయ‌ని లోకేష్ తెలిపారు.

కాగా, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ఇన్నోవేషన్ వర్శిటీ అకడమిక్ ఎక్సలెన్స్, ఇన్నోవేషన్స్‌ను ఏకీకృతం చేసే దిశగా పని చేస్తుంది. పరిశోధన, విద్య, ఉపాధిలో కీలక సవాళ్లను పరిష్కరించడంపై దృష్టి సారిస్తుంది. హబ్- అండ్ – స్పోక్ మోడల్‌ను అనుసరించి ఇన్నోవేషన్ యూనివర్శిటీ సెంట్రల్ హబ్‌గా పని చేస్తుంది.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఫిజిక్స్ వాలా ఫౌండర్ & సిఇఓ అలఖ్ పాండే, కో ఫౌండర్ ప్రతీక్ బూబ్, పిడబ్ల్యు ఫౌండేషన్ హెడ్ విజయ్ శుక్లా, డైరక్టర్ సోన్ వీర్ సింగ్, హెడ్ ఆఫ్ ఇన్నొవేషన్స్ దినకర్ చౌదరి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement